HomeMovie Newsబాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన...

బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్

- Advertisement -

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో ఘన కీర్తిని సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం. ఆయన 30 ఏళ్ల కల ‘పొన్నియిన్ సెల్వన్’. ఎంజీ ఆర్ నుంచి కమల్ హాసన్ రజనీకాంత్.. ఆ తరువాత దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఎన్నో రకాలుగా మణిరత్నం ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో ఈ సినిమా రూపు దాల్చింది.

రెండు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1′ పొన్నియిన్ సెల్వన్ 1′ సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుంది. తొలి మూడు రోజుల వరకే కాకుండా రేపు, ఎల్లుండి కూడా తమిళ నాట అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఇక తెలుగు, హిందీ ప్రేక్షకుల నుంచి తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ పై డివైడ్ టాక్ వచ్చినా.. క్రమంగా టాక్ మెరుగై కలెక్షన్లు కూడా నిలకడగా రావడం విశేషం.

See also  ఓటీటీలో విడుదలయిన విక్రమ్ కోబ్రా సినిమా

కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం తొలి రెండు రోజుల వరకు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం విశేషం. అంతే కాకుండా మూడవ రోజు నాటికి 200 కోట్ల క్లబ్‌లో చోటు దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. వారి అంచనా నిజం అయింది.

మూడు రోజులు పూర్తయ్యే నాటికి ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇక రానున్న రోజులు పండుగ సెలవులవడం వలన, వాటిని ఉపయోగించుకుని మొదటి వారంలోనే 300 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మొదటి వారాంతంలో భారీ స్థాయిలో వసూళ్లు సాధించడమే కాకుండా కలెక్షన్లలో ఎక్కడా డ్రాప్ లేకుండా నిలకడగా ఉంది. కాగా మణిరత్నంకి ఇది మొట్ట మొదటి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక తమిళ మార్కెట్‌లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

కల్కి నవల యొక్క అనుసరణగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌ సినిమాకి జయమోహన్ రచయితగా పని చేశారు. మరియు మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్ లో ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు నటించారు. రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

See also  పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories